Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని అనర్హురాలిగా ప్రకటించాలి!: స్పీకర్ కు వైసీపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి

  • పార్టీ మారిన రాజేశ్వరిపై చర్యలు తీసుకోవాలంటూ విన్నపం
  • గతంలో పార్టీ మారిన వారిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి
  • విపక్ష ఎమ్మెల్యేలతో నడుస్తున్న ప్రభుత్వం ఇదేనన్న ధర్మాన
ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్పీకర్ ను కోరారు. ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని విన్నవించారు. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇచ్చిన ఫిర్యాదులపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

వంతల రాజేశ్వరి ఈ నెల 4వ తేదీన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెకు టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు, తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్బంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని ప్రభుత్వం నడిపిస్తున్నారని విమర్శించారు. దేశంలో విపక్ష ఎమ్మెల్యేలతో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు.
kodela sivaprasad
Telugudesam
YSRCP

More Telugu News